Thursday, December 24, 2015

'అశ్లీలం'పై సన్నీ లియోన్‌ క్లాస్‌

సన్నీ లియోన్‌ మనకెలా పరిచయమైందో కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదేమో. ఇప్పుడైతే అర్ధనగ్నపు వేషాలేస్తోంది కానీ.. దానికి ముందు అరడజనుకు పైగా పోర్న్‌ సినిమాల్లో ఎలా కనిపించిందో ప్రపంచ వ్యాప్తంగా ఏ పోర్న్‌ సినిమా ప్రియుడిని అడిగినా చెబుతారు. అశ్లీలంలో మాస్టర్‌ డిగ్రీలు చేసిన సన్నీ లియోన్‌.. ఇప్పుడు సడెన్‌గా ఆ కాన్సెప్ట్‌ మీద జనాలకు క్లాసులు పీకుతోంది. తనకు కోట్లాది మంది అభిమానులున్నారని సన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఆ అభిమానులందరూ ఆమెలో ఏం చూసి తన ఫ్యాన్స్‌ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాలా? ఆ తరహా ఫ్యాన్స్‌ సన్నీతో పద్ధతిగా ఎందుకుంటారు చెప్పండి? సన్నీని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి.. సరికొత్త చిత్రాలు, వీడియోలు చూసినట్లున్నారు. వాటిని సన్నీతో కూడా షేర్‌ చేసుకోవాలనుకున్నారో ఏమో.. ఆమె ట్విట్టర్‌ పేజీని 'ఆ టైపు' వీడియోలు, ఫొటోలతో నింపేస్తున్నారు. ఐతే ఈ తరహా అభిమానుల తీరుతో విసుగెత్తిపోయిన సన్నీ.. తన ట్విట్టర్‌ పేజీలో బూతు వీడియోలు, ఫొటోలు పోస్ట్‌ చేస్తున్న వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తోంది. నా దగ్గర బ్లాకింగ్‌ బటన్‌ ఉండి జాగ్రత్త.. మీరలాంటి కంటెంట్‌ పోస్ట్‌ చేశారంటే మిమ్మల్ని బ్లాక్‌ చేసి పారేస్తా అని బెదిరించింది. ప్రపంచంలో అతి పెద్ద బ్లాకింగ్‌ లిస్టు ఉన్నది తనకేనేమో అని కూడా వయ్యారాలు పోయింది. కానీ సన్నీ అశ్లీలం మీద ఇలా బాధపడిపోతుంటే.. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అన్న సామెత గుర్తురాకుండా ఉంటుందా? -

No comments:

Post a Comment