Thursday, December 24, 2015

ఈసారైనా గెలుస్తావా బ్రహ్మీ?

బ్రహ్మానందం పనైపోయిందంటూ ఒకటి ఏడాది కిందట మొదలైన ఉత్తుత్తి ప్రచారమే ఇప్పుడు నిజమవుతున్నట్లుంది. టాలీవుడ్లో బ్రహ్మానందం పని దాదాపుగా అయిపోయినట్లే కనిపిస్తోంది. ఈ ఏడాదిలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క సినిమా లేదు బ్రహ్మికి. ఆయన క్యారెక్టర్లు వరుసగా తుస్సుమంటున్నాయి. అదే సమయంలో 30 ఇయర్స్‌ పృథ్వీ ఫుల్‌ రైజింగ్‌లో ఉన్నాడు. వరుసగా అతడి క్యారెక్టర్లు పేలిపోతున్నాయి. నెమ్మదిగా బ్రహ్మి ప్లేస్‌ను పృథ్వీ రీప్లేస్‌ చేసేస్తున్నాడన్న అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ మధ్య రిలీజైన 'బెంగాల్‌ టైగర్‌' బ్రహ్మికి పెద్ద పరీక్షగా అందరూ భావించారు. అదే సినిమాలో బ్రహ్మితో పాటు పృథ్వీ కూడా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అందరూ ఆసక్తి చూపించారు. చివరికి పృథ్వీదే సినిమాలో పూర్తి డామినేషన్‌ అయింది. బ్రహ్మి పాత్ర తేలిపోయింది. ఐతే 'బెంగాల్‌ టైగర్‌' వచ్చిన రెండు వారాలకే ఇప్పుడు మరోసారి పృథ్వీ-బ్రహ్మి వార్‌ జరగబోతోంది. 'సౌఖ్యం' సినిమాలోనూ ఇద్దరూ స్పెషల్‌ క్యారెక్టర్స్‌ చేశారు. పృథ్వీ బాహుబలి స్పూఫ్‌తో ఆకట్టుకుంటే.. బ్రహ్మి ఆకాశంలోని మెరుపులోంచి సిగరెట్‌ వెలిగించుకునే సీన్‌తో ఆకర్షించాడు. దీంతో ఈ రెండు క్యారెక్టర్ల మీదా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ రెంటిలో ఏ క్యారెక్టర్‌ హైలైట్‌ అవుతుంది.. బ్రహ్మి ఈసారైనా పృథ్వీతో పోటీలో గెలుస్తాడా.. అన్నది ఆసక్తికరం.

1 comment: