Monday, December 7, 2015

మధ్యలో మహేష్‌ బావ తన్నుకుపోతాడా?

ప్రేక్షకుల మూడ్‌ ఎప్పుడెలా ఉంటుందో పసిగట్టడం కష్టం. ఇంతకుముందు సినిమా రొటీన్‌గా ఉన్నా.. బాగా నవ్విస్తే, బ్రహ్మానందం క్యారెక్టర్‌ క్లిక్‌ అయితే సినిమాను హిట్‌ చేసేసేవాళ్లు. కానీ ఈ మధ్య రొటీన్‌ సినిమాల్ని అస్సలు ఇష్టపడట్లేదు. ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్ప సినిమాలు ఆడట్లేదు. ఈ ఏడాది హిట్టయిన సినిమాల వరస చూస్తేనే ఆ సంగతి అర్థమైపోతుంది. హిట్‌ అయిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. ఏమాత్రం రొటీన్‌ అన్నా జనాలు దారుణంగా తిప్పి కొడుతున్నారు. 'బ్రూస్‌ లీ' సినిమాలో ఎన్ని ఆకర్షణలున్నా.. కామెడీ కొద్దిగా వర్కవుటైనా అలాంటి ఫలితం చూసిందంటే.. రొటీన్‌ సినిమాల్ని జనాలు ఎలా తిరస్కరిస్తున్నారో అర్థమైపోతుంది. అందుకే ఈ నెల రాబోతున్న పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమా 'భలే మంచి రోజు' మీద మంచి అంచనాలున్నాయి. రాబోయే మూడు వారాల్లో బెంగాల్‌ టైగర్‌, లోఫర్‌, మామ మంచు అల్లుడు కంచు, సౌఖ్యం లాంటి సినిమాలు రాబోతున్నాయి. ఐతే వీటన్నింటి మీదా రొటీన్‌ అన్న ముద్ర ఉంది. ట్రైలర్లు చూస్తేనే ఆ సంగతి అర్థమైపోతుంది. ఐతే 'భలే మంచి రోజు' ట్రైలర్‌ మాత్రం వీటి మధ్య చాలా భిన్నంగా కనిపించింది. సుధీర్‌ బాబుకు ఇప్పటిదాకా సరైన సక్సెస్‌ లేకున్నా.. అతడికో ఇమేజ్‌ రాకున్నా.. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయంటే ఆ మూవీ టీజర్‌, ట్రైలర్‌ క్రియేట్‌ చేసిన ఇంట్రెస్టే కారణం. జనాల్లో ఉన్న ఆసక్తిని గమనించే డిసెంబరు 25న మామ మంచు అల్లుడు కంచు, సౌఖ్యం సినిమాలు రిలీజవుతున్నప్పటికీ కాన్పిడెంట్‌ గా అదే రోజు విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు కొత్తదనం ఉన్న సినిమాల్ని ఆదరిస్తున్న నేపథ్యంలో అంచనాలకు తగ్గట్లు ఉంటే 'భలే మంచి రోజు' ఇయర్‌ ఎండింగ్‌లో సర్‌ప్రైజింగ్‌ హిట్టయి మూవీ ఆఫ్‌ ద మంత్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

No comments:

Post a Comment